నన్ను చూసి అలాంటివి ఎవరూ నన్ను అడగరు : నటి జయవాణి

తెలుగులో పలు చిత్రాలలో కొంత మేర నెగిటివ్ షేడ్స్ మరియు బోల్డ్ తరహా ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి గురించి తెలుగు సినీ పరిశ్రమలో  తెలియనివారుండరు.

ఇటీవలే నటి జయవాణి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.

 ఇందులోభాగంగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై స్పందించింది.ఇందులో భాగంగా తాను ఎప్పుడూ కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోలేదని స్పష్టం చేసింది.

Jaya Vani, Telugu Character Artist, Casting Couch, Tollywood, Artist Jaya Vani

అంతేకాక తాను సినిమా షూటింగ్ సమయంలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనని, తన పని తాను చేసుకు పోతూంటానని  ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడినా తన సంభాషణ ఎక్కువ సేపు ఉండదని చెప్పుకొచ్చింది.ఇక తాను ఎవరితోనూ ఎక్కువగా చనువుగా ఉండనని, అలాగే కొంతమేర రెబల్ గా కనిపించడంతో ఎవరూ తనని క్యాస్టింగ్ కౌచ్ కోసం సంప్రదించలేదని తెలిపింది.

అంతేగాక ఏదైనా సరే మనం ఇతరులతో ప్రవర్తించే తీరును బట్టి ఉంటుందని కాబట్టి తానెప్పుడూ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని తెలిపింది.అయితే పలు చిత్రాలలో తాను నటించిన పాత్రల గురించి ఎవరు ఏమన్నా దాని గురించి పెద్దగా పట్టించుకోనని కేవలం తన పాత్రకి వంద శాతం న్యాయం చేసేందుకు తాను ప్రయత్నిస్తానని తెలిపింది.

Advertisement

అయితే ఆ మధ్య కాలంలో నటి జయ వాణి  నటించినటువంటి గుంటూరు టాకీస్ అనే చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం జయవాని పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు