పార్టీ మారిన నేతలకు బుద్ధి చెప్పాలి..: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన బీఆర్ఎస్( BRS ) తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా బుద్వేల్ లో చేసిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే పార్టీ మారిన నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

కష్టకాలంలో ఉన్న పార్టీని కాదని వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా పని చేసే నేతలకు గుణపాఠం చెప్పాలన్నారు.బీఆర్ఎస్ పార్టీలో కేసీఆ( KCR )ర్ అవకాశాలు ఇస్తే ప్రజల మద్ధతుతో గెలిచి ఈ రోజు వేరే పార్టీలోకి వెళ్లారని మండిపడ్డారు.

ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి( Ranjith Reddy ) బుద్ధి చెప్పాలని కోరారు.అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించగలమని కేటీఆర్ తెలిపారు.

Advertisement

కాంగ్రెస్ కు 150 కంటే ఎక్కువ సీట్లు రావన్న ఆయన బీజేపీకి( BJP ) 200 సీట్లు కూడా రావని చెప్పారు.కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని విమర్శించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు