వాట్సాప్‌లో ఫాంట్ సైజ్ మార్చుకోండిలా..!

ప్రస్తుత ఆధునిక యుగంలో వాట్సాప్ మన జీవితంలో అంతర్భాగం అయి పోయింది.కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, స్నేహితులతో ముచ్చటించాలన్నా, ఆఫీసు వ్యవహారాలైనా వాట్సాప్ ద్వారానే సాగుతున్నాయి.

ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే యాప్‌లలో ఒకటైన వాట్సాప్‌ విజయ వంతం కావడానికి కారణం.అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లు ఇస్తూ, సరికొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను వాట్సాప్ సరికొత్త అనుభూతికి గురయ్యేలా చేస్తోంది.

Change Font Size On WhatsApp , WhatsApp , Font Size , Changeing , Latest News

ఇక చాలా ఫీచర్లు ఉన్నా యూజ ర్లందరికీ అవి తెలియవు.ముఖ్యంగా వాట్సాప్‌లో పాంట్ సైజ్ పెంచుకోవడానికి కూడా ఓ ఫీచర్ అందుబాటులో ఉంది.

థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగించకుండానే: మీకు దృష్టి సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెద్దవిగా ఉంటే చదవడానికి వీలుగా ఉంటుంది.ఈ సౌకర్యం కోసం కొందరు థర్డ్ పార్టీ యాప్‌ లను వినియోగిస్తుంటారు.

Advertisement

ఆ అవసరం లేకుండానే వాట్సాప్‌లో ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు.ఇందుకు వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌ లోకి వెళ్లాలి.

ఆ తర్వాత, చాట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.అప్పుడు థీమ్, వాల్ పేపర్ ఉంటాయి.

వాటి కింద చాట్ సెట్టింగ్స్ ఉంటుంది.అందులో చివరిగా ఫాంట్ సైజ్ ఆప్షన్ ఉంటుంది.

దానిని క్లిక్ చేస్తే స్మాల్, మీడియం, లార్జ్ ఆప్షన్లు ఉంటాయి.మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా దానిని మార్చుకోవచ్చు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

మరింత పెద్దగా ఫాంట్ కనిపించాలంటే: వాట్సాప్‌లో ఉన్న సెట్టింగుల ప్రకారం టెక్స్ట్ పెద్దగా లేకుంటే, మరింత పెద్దగా ఫాంట్ మీకు కావాలంటే థర్డ్ పార్టీ యాప్‌లు అందు బాటులో ఉన్నాయి.వాటిని ఉపయోగించడం వల్ల ఫాంట్ బాగా పెంచు కోవచ్చు.

Advertisement

టెక్స్ట్ డిఫాల్ట్ పరిమాణం కంటే పెద్దగా ఉన్నప్పుడు టెక్స్ట్ చదవడం చాలా సులభం అవుతుంది.అయితే థర్డ్ పార్టీ యాప్‌లు ఎంత వరకు సురక్షితమో చెప్పలేం.

కాబట్టి వాట్సాప్‌ సెట్టింగ్స్‌ను ఉపయోగించుకుని ఫాంట్ పెంచుకోవచ్చు.

తాజా వార్తలు