భయపడ్డట్లే జరిగింది, సాధించింది తక్కువేం కాదు

చంద్రయాన్‌ ల్యాండ్‌ కోసం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆసక్తిగా చూశారు.

అత్యంత ఆసక్తిని కలిగించిన చంద్రయాన్‌ ల్యాండింగ్‌ విషయంలో ఇస్రో చైర్మన్‌ అంతకు ముందు చెప్పినట్లుగానే ఆ 15 నిమిషాలు అత్యంత కష్టంగా సాగాయి.

ప్రయోగం మొత్తం ఒక ఎత్తయితే, ఆ పదిహేను నిమిషాలు ఒక ఎత్తు అయ్యింది.అనుకున్నట్లుగానే ఆ పదిహేను నిమిషాల్లో 13 నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది.

కాని చివరి రెండు నిమిషాల్లో సాంకేతిక కారణంగా చంద్రయాన్‌తో కనెక్షన్‌ తెగిపోయింది.చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌ 2 ఆగిపోయిందని ఇస్రో బాధగా ప్రకటించింది.అర్ధరాత్రి దాటిన తర్వాత టీవీలకు అతక్కు పోయి కూర్చున్న వారు కాస్త నిరాశతో టీవీలను ఆఫ్‌ చేశారు.
ప్రయోగంను ప్రత్యక్షంగా చూసేందుకు బెంగళూరు ఇస్రో కేంద్రంకు వెళ్లిన ప్రధాని మోడీ కూడా తిరుగు ప్రయాణం అయ్యారు.

ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ విఫలం అయ్యిందని బాధ అక్కర్లేదు.మీరు దీని కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మాకు తెలుసు.దేశం మొత్తం మీకు మద్దతుగా ఉంది.

Advertisement

ముందు ముందు మరిన్ని అద్బుతాలను మీరు ఆవిష్కరిస్తారని మేము నమ్ముతున్నాం.ఈ ప్రయోగంలో మీరు చాలా సాధించారు.

దేశం గర్వించేలా మీరు చేశారంటూ మోడీ ప్రశంసించారు.ప్రతి ఒక్కరు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేయాలి.

వారు ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూసేలా చేశారు.ఈ అద్బుతం కొద్దిలో తప్పినా కూడా ముందు ముందు తప్పకుండా ఇస్రో మరిన్ని విజయాలను అందుకుంటుందనే నమ్మకంను దేశ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!
Advertisement

తాజా వార్తలు