జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ ఖరారు..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఈ మేరకు వచ్చే నెలలో చంద్రబాబు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో చంద్రబాబు షెడ్యూల్ ను టీడీపీ ఖరారు చేస్తోంది.జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ బహిరంగ సభలు మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించే విధంగా టీడీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుందని తెలుస్తోంది.ఈనెలాఖరులోగా 25 బహిరంగ సభలను పూర్తి చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

ఈ 25 సభలే కాకుండా ఎన్నికల్లోగా మరో రెండు భారీ బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేస్తుందని సమాచారం.ఆ రెండు సభలకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యే విధంగా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?