అమిత్ షా, జేపీ నడ్డాలతో ముగిసిన చంద్రబాబు భేటీ..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో( JP Nadda ) కలసి సమావేశమయ్యారు.

దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పొత్తులపై తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇక ఇదే సమయంలో ఆదివారం ఉదయం ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.

Advertisement

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీలో రాజకీయాలు ఇంకా పొత్తులపై పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ రెడీ బీజేపీతో జనసేన( Jana sena ) పొత్తులో ఉంది.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా కలిస్తే 2014 మాదిరిగా వచ్చే 2024 ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు.వార్తలు వస్తున్నాయి.

మరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పొత్తుల విషయంలో బీజేపీ పార్టీ పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు