సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పేరు, స్వార్థం కోసం జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు ఏమైనా ఫర్వాలేదు కానీ తన గల్లా పెట్టె నిండితే చాలన్నది జగన్ మనస్తత్వమన్నారు.ఎక్కడా లేని పన్నులు ఏపీలో విధిస్తున్నారని విమర్శించారు.

రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా చర్చించిందా అని ప్రశ్నించారు.పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు.

స్వలాభం కోసం ఆక్వా రైతులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.జగన్ సీఎం అయ్యాక ఏపీకి శని పట్టిందని వ్యాఖ్యనించారు.

Advertisement

సమస్యలకు పరిష్కారం ఎదురుదాడి చేయడం కాదన్న చంద్రబాబు వీలైతే రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు