ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 30కి వాయిదా వేసింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు పెండింగ్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.అయితే దీపావళి సెలవుల తరువాత స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ధర్మాసనం తీర్పును వెలువరించనున్న సంగతి తెలిసిందే.

ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24 గా ఉన్నారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు