ఆధారం లేని కేసులో చంద్రబాబును ఇరికించారు..: అచ్చెన్నాయుడు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ములాఖత్ ముగిసింది.

చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి క్యాంపు నుంచి జైలుకు వెళ్లారు.

వీరితో పాటు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబును కలిశారు.ములాఖత్ ముగిసిన అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆధారం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని తెలిపారు.

కావాలనే కుట్ర పూరితంగా తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారని మండిపడ్డారు.ఇటువంటి కేసును యావత్ భారతదేశంలోనే ఎప్పుడూ చూసి ఉండరని చెప్పారు.

ఇవాళ్టికి 16 రోజులు గడిచినా కేసులో చిన్న ఆధారం కూడా లేదని చెప్పారు.రెండు రోజులపాటు జరిగిన సీఐడీ అధికారుల విచారణలో చంద్రబాబుకు 33 పనికిమాలిన ప్రశ్నలు వేశారని తెలిపారు.

Advertisement

ఈ క్రమంలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు లాయర్లతో చర్చించి సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జైల్లో పెట్టారని వెల్లడించారు.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్
Advertisement

తాజా వార్తలు