వచ్చే ఎన్నికల్లో 135 సీట్లు మావే..చంద్రబాబు

ఏపీలో ఏమవుతోంది అసలు.ప్రధాన ప్రతిపక్షం ఉంటుందా అసలు.

లేక పెట్టె బేడా సర్దేస్తుకుని పక్క రాష్ట్రాలు పారిపోతాయ అనే డౌట్ వస్తోంది మన బాబోరి మాటలు వింటుంటే.

చాల్ చాల్లే ఎం మాట్లాడుతున్నావ్ చంద్రబాబు జోస్యం చెప్తే అది అయ్యి తీరుతుంది.

అంటున్నారు టిడిపి నాయకులు కూడా.చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో టిడిపి 135 సీట్లలో గెలిస్తే ప్రధాన ప్రతిపక్షం కేవలం 40 సీట్లకే పరిమితం అవుతుందా? అసలు జగన్ పార్టీ కి అటువంటి పరిస్థితి ఉందా.ఈ లేక్కలు చెప్పడానికి అయినా సరే అర్థం ఉండాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వైసీపి అధ్యక్షుడు ఒక పక్క ప్రచారంలో దూసుకు పోతున్నాడు.అటు హామీల వర్షంలో ప్రజలు తడిచి ముద్దవుతున్నారు.

Advertisement

ఆ వానలో తడిచి ప్రజలు ఎక్కడ జగన్ కి జై కొడతారో అని టిడిపి వాళ్ళు గొడుగులు పట్టుకుని రెడీగా ఉన్నారు.ఏమి చేసినా సరే మేము మాత్రం జగన్ రెడ్డి యాత్రకి వెళ్తాం అంటూ జనాలు తండోప తండాలుగా వెళ్తున్నారు.

మరి చంద్రబాబు చెప్తున్నా జోస్యానికి.జగన్ కి ప్రజలలో వస్తున్నా ఆదరణకి పోలిక ఏమన్నా ఉందా అంటూ జనాలు నోళ్ళు వేల్లబెడుతున్నారు.

అసలు విషయానికి వస్తే శుక్రవారం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.రానున్న ఎన్నికల్లో టిడిపి తప్పకుండ అధికారంలోకి వచ్చి తీరుతుంది ఈ విషయంలో ఎవ్వరు కూడా అనుమాన పడవద్దు అంటూ తెలిపారు.

ప్రతిపక్షం ఇప్పట్లో కోలుకోదు అని.అనేక చోట్ల పోటీ ఇవ్వగలిగిన స్ధితిలో కూడా లేదని చంద్రబాబు చెప్పారు.మొత్తం 175 నియోజకవర్గాల్లో మహా అయితే వైసిపి పోటీ ఇవ్వగలిగింది 40 నియోజకవర్గాల్లోనే అని మిగిలిన 135 నియోజకవర్గాల్లో టిడిపి హవానే అంటూ జోస్యం చెప్పేశారు.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ A తో పాటు.. ఈ ఆహార పదార్థాలు మీ డైట్ లో..?

అంతేకాదు ప్రజలు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.”టిడిపి అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, తమ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని జనాలందరూ నమ్ముతాన్నార’ని కూడా చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

మరి చంద్రబాబు జోస్యాన్ని.ప్రజలు హాస్యం చేస్తారో.

లేక నిజం చేస్తారో వేచి చూడాల్సిందే.