ఉద్యోగులు, నిరుద్యోగులకు చంద్రబాబు సంచలన హామీలు..!!

ఎన్నికలవేళ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు చంద్రబాబు లేఖ రాశారు.

తామా అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అందిస్తామని పేర్కొన్నారు.సకాలంలో జీతాలు, పింఛన్ లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు.

ఖాళీ పోస్టులన్నిటిని భర్తీ చేస్తామని చెప్పారు.ఈ ఎన్నికలలో ఉద్యోగులు, పింఛన్ దారులు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఉద్యోగులకు తెలుగుదేశం, వైసీపీ ఏమి ఇచ్చిందో తెలుసా అని చెప్పుకొచ్చారు.వైసీపీ ( YCP ) ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని భయం గుప్పెట్లో ఉన్నారని చంద్రబాబు( Chandrababu ) అన్నారు.

Chandrababu Sensational Assurances For Employees And Unemployed Details, Chandra
Advertisement
Chandrababu Sensational Assurances For Employees And Unemployed Details, Chandra

వారంలో సీపీఎస్( CPS ) రద్దు చేస్తామని మోసగించారు.  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సి తెచ్చారు.ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి భయం గుప్పిట్లో నుంచి ఉద్యోగులు బయటపడాలని.

ఐదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పడుతున్న బాధ తను స్వయంగా చూసినట్లు చెప్పుకొచ్చారు.జీతాలు రాక చాలా మంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు.

హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని విమర్శించారు.అదనపు పింఛన్ క్వాంటం తగ్గించి వృద్ధులను ఇబ్బందులకు.

ఈ ప్రభుత్వం గురిచేసిందని చంద్రబాబు విమర్శలు చేయడం జరిగింది.

జుట్టు రాల‌కుండా ఒత్తుగా పెరగాలా? అయితే ఈ చిట్కా మీకే!
Advertisement

తాజా వార్తలు