మంత్రులపై చంద్రబాబు సెటైర్లు

ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు.ఉదయం లేచింది మొదలు తనను తిట్టడమే మంత్రులకు పెద్దపని అని విమర్శించారు.

మంత్రులకు ఓ నోట్ వస్తుందన్న చంద్రబాబు ఆ నోట్ లో ఉన్నది ఉన్నట్లుగా చదివేస్తారని ఎద్దేవా చేశారు.అనంతరం మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ శాఖ మంత్రి అని, సొంతూరులో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని అన్నారు.నియోజకవర్గంలో పది ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి, పెట్టుబడులు గురించి అడిగితే కోడి గుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి అని ఆరోపించారు.

జగన్ కు కోర్టుల్లో అనుకూల తీర్పులు రావాలని యాగాలు చేసే వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి., రైతుబజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రి, పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యామంత్రి అని మండిపడ్డారు.

Advertisement

అమరావతి ఎక్కడికి పోదన్న చంద్రబాబు భవిష్యత్ లో జరిగేది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ అని వెల్లడించారు.

బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?
Advertisement

తాజా వార్తలు