శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

శ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు.

అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.తమిళనాడు( Tamil Nadu )లో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు.ధర్మాన్ని రక్షించుకునేందుకు.

తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తాను అని చంద్రబాబు అన్నారు.ఎపి ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని, 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చంద్రబాబు అన్నారు.

Advertisement

అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు.చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడు కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

కడుపు నిండుగా రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉండాలా.. అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో దీనిని చేర్చండి!
Advertisement

తాజా వార్తలు