నేటి నుంచే అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న చంద్రబాబు 

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టిడిపి( TDP ) ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించడమే కాకుండా,  అక్కడ రాజధానికి అనువుగా అనేక నిర్మాణాలు చేపట్టింది.

పూర్తిస్థాయిలో రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేసినా,  రకరకాల కారణాలతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి.

ఇక 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి చెంది వైసిపి అధికారంలోకి రావడంతో, అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.మళ్ళీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించారు.

దీనికి తోడు కేంద్రం,  ప్రపంచ బ్యాంకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తుండడంతో,  పూర్తిస్థాయిలో అమరావతిలో నిర్మాణ పనులను పున ప్రారంభించేందుకు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు నేడు ఏపీ సిఆర్డిఏ ప్రాజెక్ట్ (AP CRDA project )ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా, రాజధాని పనులpai ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది.  ఈరోజు 11 గంటలకు ఆ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.160 కోట్ల రూపాయలతో అప్పట్లో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సిఆర్డిఏ.( CRDA )  కానీ ఆ తర్వాత ఆ పనులు ఎక్కిడివి అక్కడే నిలిచిపోయాయి.

Advertisement

  ఈనెల 16 జరిగిన సీఆర్టీఏ అథారిటీ సమావేశంలో పనులు ప్రారంభం పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.దేనిలో భాగంగానే నేడు పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

వాస్తవంగా గత టిడిపి ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనా,  వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడివి అక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి? పటిష్టంగా ఉన్నాయా లేక దెబ్బతిన్నాయా అనే దానిపైన అధ్యయనం చేయించి,  నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.దానిలో భాగంగానే నేటి నుంచి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు.ఈ ఐదేళ్ళ పాలనలో పూర్తిస్థాయి లో అమరావతి నిర్మాణ పనులను పూర్తిచేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు