వెన్నుపోటు పొడవడంలో పురంధేశ్వరి తరువాతే చంద్రబాబు..: మంత్రి రోజా

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పురంధేశ్వరికి పదవులే ముఖ్యమని విమర్శించారు.

తన కేసులు త్వరగా తేల్చండని జగన్ స్వయంగా పిటిషన్ వేసుకున్నారన్న మంత్రి రోజా కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబుపై పురంధేశ్వరి సీబీఐకి లేఖ రాయాలని తెలిపారు.పురంధేశ్వరికి ఓ నియోజకవర్గం లేదు, ఓట్లు వేసే వారు లేరని చెప్పారు.

వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన వారు పురంధేశ్వరి అని ఎద్దేవా చేశారని సమాచారం.గతంలో సీఎం సీటు కోసం చంద్రబాబుతో పురంధేశ్వరి పోటీ పడలేదా అని ప్రశ్నించారు.

బావ కళ్లల్లో ఆనందం కోసం ఆయన ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు.ఎన్టీఆర్ కుమార్తె అని పార్టీలు మారి పదవులు పొందారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు