అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో చంద్రబాబుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ ను మంజూరు చేసింది.కాగా అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు