చిత్తూరు జిల్లాలో ఒక పక్క జగన్ పాదయాత్ర చేస్తూ చంద్రబాబు సొంత జిల్లాలో చక్రం తిప్పాలని చూస్తుంటే.
మరో పక్క చంద్రబాబు మాత్రం జగన్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఇప్పటి వరకూ చంద్రబాబు రాజకీయం జగన్ రుచి చూసి ఉండడు.కానీ బాబు వేసిన ఈ స్కెచ్ తో జగన్ కి ఇప్పటికే టెన్షన్ మొదలయ్యి ఉంటుంది.
చంద్రబాబు పై పోటీ చేసిన వైసీపి ప్రత్యర్ధి ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వెళ్తున్నారు.అసలు వివరాలలోకి వెళ్తే.
చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడుపై సుబ్రమణ్యంరెడ్డి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.ఇప్పుడు అదే వ్యక్తిని బాబు టిడిపి లోకి తీసుకు వచ్చి జగన్ కి షాక్ ఇచ్చారు.2006లో ఆయన ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంలో శాంతిపురం జడ్పీటీసీగా పోటీచేసి గెలవడంతో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు.
అయితే ఆయన పదవిలో ఉండగానే పదవి వదులుకుని మరీ వైసీపీలోకి జంప్ చేసేశారు.నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేసేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు.
అయితే జగన్ గత ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళికి టిక్కెట్ ఇచ్చారు.అయితే వైసీపిలో తనకి జరుగుతున్న అవమానాలకు తీవ్ర మనస్థాపానికి గురైన సుబ్రహ్మణ్యం రెడ్డి ఆదివారం అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు.
ఈ సందర్బంగా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.అయితే… సీఎం చంద్రబాబు త్వరలో చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీకి బలంగా వ్యక్తి ఇప్పుడు టీడీపీలో చేరిపోవడం జగన్‌కు పెద్ద మైనస్సే.అయితే సుబ్రహ్మణ్యంరెడ్డి లాంటి సీనియర్స్ ని జగన్ వదులుకోవడం చిత్తూరులో జగన్ కి బాగా దెబ్బే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే తానూ అధికారంలో ఉన్నా లేక పోయినా సరే సుబ్రహ్మణ్యంరెడ్డికి అక్కడ బలమైన కేడర్ ఉంది ఇప్పుడు తన వర్గం మొత్తం టిడిపికి సపోర్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy