తెలంగాణలో మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఇందులో భాగంగా కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషమని తెలిపారు.

మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్ధమని కేంద్రం లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని బండి సంజయ్ ఆరోపించారు.స్పందించకపోగా కేంద్రమే సహకరించడం లేదని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్రం చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని తెలిపారు.రాష్ట్ర అభివృద్ది, సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తోందని వెల్లడించారు.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement