కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది... కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేసీఆర్ చెప్పారన్నారు.

ఇందులో భాగంగానే సింగరేణి అధికారులను పంపి అధ్యయనం చేయాలని చెప్పారని తెలిపారు.ఈ దెబ్బతో కేంద్రం దిగి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ ఫలితంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుంటున్నామని కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు.ప్రైవేటీకరణపై తాత్కాలికంగా కేంద్రం వెనక్కి తగ్గిందన్న కేటీఆర్.

కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటదంటూ వ్యాఖ్యనించారు.

Advertisement
ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు