ప్రభాస్ గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పే ఒకే ఒక్క మాట ఇదే !

హీరో ప్రభాస్( Prabhas ) గురించి ఎవరిని అడిగినా ఒకటే మాట చెబుతారు.ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటారు అని.

అవసరం అయితే తప్ప మాట్లాడరు అని చెబుతూ ఉంటారు.ఏదైనా ఇంటర్వ్యూలలో కూర్చున్నా కూడా ఆయన ఒకటి రెండు మాటల్లోనే విషయాన్ని పూర్తి చేస్తారు.

ఇలా చాలా తక్కువ మంది ఉంటారు.సాధారణంగా ఇండస్ట్రీ వారు ఒకటి అడిగితే 10 మార్కులు ఆన్సర్ చెబుతారు.

వాగుతూనే ఉంటారు కెమెరా కనిపిస్తే చాలు వారిని ఆపడం చాలా కష్టమవుతుంది.అలాంటి ఒక ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి ఒక మనిషి అలా ఉండగలుగుతున్నాడు అంటే ఆశ్చర్యమే.

Advertisement

వాస్తవానికి ప్రభాస్ కి చాలా మంది స్నేహితులు ఉంటారు.వారంతా ఆయన అంటే పడి చచ్చిపోతుంటారు.

అందుకు గల ముఖ్యమైన కారణం ఆయన చెప్పాల్సిన విషయాన్ని చేసి చూపిస్తారు మాటల్లో చూపించరు.

ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి వస్తే లేదా తన సినిమాలో మొదటిసారి నటిస్తూ ఉంటే వారికి ఏం కావాలో తెలుసుకొని ఒకటికి పది రకాలు తయారు చేయించి వారి రూముకి పంపిస్తాడట.ఇలా చాలామంది నటీనటులకు నార్త్ ఇండియా ( North India )నుంచి వచ్చిన వారికి వేరే భాష నుంచి వచ్చిన నటనకు అనుభవాలు ఉన్నాయి.ప్రభాస్ పెట్టే తిండి తింటే సినిమా అయ్యేలోపు చాలా లావైపోతాము అని కామెంట్ చేసిన నటులు డజన్స్ కి డజన్స్ ఉన్నారు.

అయితే ప్రభాస్ చాలా బాగా ప్రేమిస్తాడు.స్నేహితులను ఎంతగానో అభిమానిస్తాడు.దగ్గర వారికి ఎప్పుడు అండగా ఉంటాడు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఇలాంటి విషయాలను ఆయన సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

Advertisement

ఇంత గొప్ప క్వాలిటీస్ ఒక నటుడికి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజవంశంలో పుట్టాడు అతను రాజు లానే ప్రవర్తిస్తూ ఉంటాడు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు.రాజసం కూడా ఉట్టిపడుతూ ఉంటుంది ప్రభాస్ మొహంలో ఎప్పుడు చూసినా.

అందుకే ప్రభాస్( Prabhas ) ని అందరూ ప్రేమిస్తారు.చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రేమను చూపించేనటునట్లు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే అతడిని ఆర్ట్ ఫామ్ లో మాత్రమే ఎక్కువగా మాట్లాడించగలుగుతారు నోటితో ఎక్కువగా సమాధానాలు పొందలేరు.

తాజా వార్తలు