ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

ప్రజా గాయకుడు గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ క్రమంలో గద్దర్ చివరి చూపు కల్పించడం కోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్డేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

గద్దర్ మృతితో రాజకీయ, ఉద్యమ నాయకులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.ప్రజల సందర్శనార్థం గద్దర భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియానికి తరలిస్తున్నారు.

కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఊపిరితిత్తులు మరియు మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement