Celebrities Insta Earnings: ఈ సెలబ్రిటీలు ఒక్కో ఇన్ స్టా పోస్ట్ కు ఎంత ఛార్జ్ చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అభిమానులకు సెలబ్రిటీలకు ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.

అంతే కాకుండా సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాని బాగా ఫాలో అవ్వడంతో పాటు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

అలాగే సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ ను సెల‌బ్రిటీలు క్యాష్ చేసుకుంటున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా క్రికెట్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాని క్యాష్ చేసుకుంటున్నారు.

వారి ట్యాలెంట్ తో ఇన్ ఫ్లుయెన్స‌ర్స్ గా మారుతూ ఉన్నారు.వీరి అకౌంట్లో పోస్టుల‌కు ఒక్కోరి రేటు ఒక్కొక్కరిది.

సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క రేంజ్ లో డబ్బు తీసుకుంటున్నారు.కాగా చాలామంది సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్( Instagram ) ద్వారా కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఆ జాబితాలోకి వెళ్తే విరాట్ కోహ్లీ( Virat Kohli ) టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు.టీమిండియా క్రికెటర్ అయినా విరాట్ కోహ్లీ ఆసియాలోకెళ్లా అత్య‌ధిక‌మంది ఫాలోవర్స్ ని క‌లిగి ఉన్నారు.

సెల‌బ్రిటీ అయిన విరాట్ త‌న ఇన్ స్టా అకౌంట్లో పోస్టుకు మూడున్న‌ర నుంచి ఐదు కోట్ల రూపాయ‌లు చార్జ్ చేస్తూ ఉన్నాడు.

విరాట్ చేత పోస్టు పెట్టించుకోవాల‌నుకుంటే ఏ బ్రాండ్ అయినా ఈ మేర‌కు డ‌బ్బులు చెల్లించాల్సిందే.విరాట్ కి దాదాపుగా 250 మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్లు ఉన్నారు.వారికి రీచ్ కావ‌డానికి వ్యాపార సంస్థ‌లు విరాట్ తో బ్రాండింగ్ పోస్టుల‌కు ఐదు కోట్లు వెచ్చించ‌డానికి రెడీగా ఉన్న‌ట్టున్నాయి.

ఇక అత‌డి త‌ర్వాత ఉంది ప్రియాంక చోప్రా.( Priyanka Chopra ) ఆమె ఒక్కో బ్రాండింగ్ పోస్టుకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయ‌ల‌ను చార్జ్ చేస్తోంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

అలాగే ఇక శ్ర‌ద్ధాక‌పూర్, అలియా భ‌ట్ లు కూడా కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల రూపాయ‌లు అనుకుంటున్నారు.కాస్తంత వ్య‌త్యాసంలో ఈ ముగ్గురు తార‌లూ ఒకే స్థాయి చార్జ్ చేస్తున్నార‌ని స‌మాచారం.ఇక ఆ త‌ర్వాతి స్థానంలో మ‌రో బాలీవుడ్ న‌టే ఉంది.

Advertisement

ఆమె క‌త్రినా కైఫ్.ఆమె ఒక్కో పోస్టుకు ఏకంగా కోటి రూపాయ‌లు చార్జ్ చేస్తోంద‌ట‌.

ఇలా టాప్ లో ఉన్న వారితో మొద‌లుపెడితే సినీ, క్రికెట్ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఎంతో కొంత తీసుకుంటూ పెయిడ్ ప్ర‌మోష‌న్లు చేస్తూ ఉన్నారు.ఇందు కోసం తార‌లు ఫాలోయ‌ర్ల సంఖ్య‌ను పెంచుకోవ‌డానికి తంటాలు ప‌డుతూ ఉంటారు.

తాజా వార్తలు