సీసీసీ పనితో ఇక ఎప్పుడు షూటింగ్స్‌కు బ్రేక్‌ పడక పోవచ్చు

మెగా స్టార్‌ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ ఇప్పటికే ఇండస్ట్రీ వారికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉంది.

ఇటీవల అపోలో ఆసుపత్రితో కలిసి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి కూడా వ్యాక్సిన్‌ ను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రతి రోజు రెండు నుండి మూడు వేల మందికి వ్యాక్సిన్‌ ను ఇచ్చేందుకు అపోలో ముందుకు వచ్చింది.భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ సీసీసీ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుంది.

కేవలం ఇండస్ట్రీకి చెందిన వారికి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ ఇప్పించడం ఈ డ్రైవ్‌ ప్రత్యేకత అంటున్నారు.సీసీసీ ఆధ్వర్యంలో ఇస్తున్న ఈ వ్యాక్సినేషన్‌ పక్రియ పూర్తి అయితే షూటింగ్‌ లకు ఇక మీదట ఎప్పుడు కూడా ఆటంకం కలిగే అవకాశం లేదని అంటున్నారు.

షూటింగ్‌ లకు హాజరు అవ్వాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకుని ఉండాలనే నిబంధన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది.కనుక వ్యాక్సిన్ ను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Ccc Covid Vaccination Program Going In Tollywood,latest News
Advertisement
Ccc Covid Vaccination Program Going In Tollywood,latest News -సీసీసీ

కరోనా థర్డ్‌ వేవ్‌ అంటున్నారు.అప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్లారిటీ లేదు.కనుక అప్పుడు షూటింగ్ లు ఆగిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే అంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త నెమ్మదిగా జరుగుతుంది.కాని షూటింగ్ లు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే అంటున్నారు.

వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత వైరస్‌ వ్యాప్తికి అంత డేంజర్ ఉండదు.కనుక షూటింగ్‌ లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

వ్యాక్సినేషన్‌ పక్రియను ఇండస్ట్రీ లో మొదటు పెట్టడం నిజంగా అద్బుతమైన నిర్ణయం అంటూ సినీ వర్గాల వారు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.వచ్చే నెల నుండి షూటింగ్‌ లు మొదలు అయితే మళ్లీ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా షూటింగ్ లు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు