పవన్ కళ్యాణ్ రాజకీయ ఊహాతీతం! రెండు పార్టీలకి వాపు తప్పదా

అతని చర్యలు ఊహాతీతం అనే మాట పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అజ్ఞాతవాసి ఉంటుంది.

ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో ఇప్పుడు జనసేనాని రాజకీయాలు చూస్తూ ఉంటే ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలకి స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల పరిస్థితి వర్మ, శర్మ పాత్రల మాదిరి తయారైంది.పవన్ చేస్తున్న రాజకీయం అర్ధమైనట్లు ఉన్న, ఇంకా ఏదో అర్ధం కాని విషయం ఉందని వారి మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నామమాత్రం మాత్రమే అని రెండు పార్టీలు భావించాయి.ఆ పార్టీ ఓట్లు చీల్చడానికి తప్ప గెలిచే అవకాశాలు లేవని బలంగా నమ్మాయి.

అయితే ఎన్నికలు దగ్గరయిన కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీలలో పవన్ కళ్యాణ్ టెన్సన్ ఎక్కువైంది.జనసేన పార్టీ అభ్యర్ధులు, అతను రాజకీయ వ్యూహంలో భాగంగా వేసిన సామాజిక సమీకరణాలు ఓ వైపు వైసీపీ ఓటు బ్యాంకుకి బలంగా గండికొట్టేలా ఉంది.

Advertisement

మరో వైపు కోస్తా ఆంధ్రాలో బలమైన నాయకుడుగా ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ అధికార పార్టీ ఆనవాళ్ళు లేకుండా చెరిపేసే ప్రయత్నం చేస్తూ వైసీపీకి ప్రధాన పోటీదారుడుగా మారిపోయాడు.దీంతో వైఎస్ జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా టార్గెట్ చేయడం మొదలెట్టి, కోస్తా ఆంధ్రాలో తన ప్రధాన ప్రత్యర్ధి పవన్ కళ్యాణ్ అని పరోక్షంగా ఒప్పుకున్నాడు.

ఇక అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉన్నాడు అని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసాడు.అయితే చంద్రబాబు పాచికలు అనుకున్న స్థాయిలో పారలేదు అని, జనం చంద్రబాబు మాటలని నమ్మడం లేదని అతనికి స్పష్టం అయ్యింది.దీంతో ఎలా అయిన ప్రభుత్వ ఓటు బ్యాంకు, అలాగే పవన్ కళ్యాణ్ వలన గతంలో తనకి పడ్డ ఓటు బ్యాంకుని పోగొట్టుకోలేక జనసేన ప్రచారాన్ని ఎక్కడికి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్స్తున్న మాట.అధికార, ప్రతిపక్షాలు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసిన ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని, రెండు పార్టీలకి ఊహించని విధంగా జనసేన ఫలితాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు