వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

వివేకా లేఖపై నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది.అయితే లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలి ముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ పిటిషన్ లో పేర్కొంది.

రికార్డుల్లో ఒరిజినల్ లేఖకు బదులుగా కలర్ జిరాక్స్ కు అనుమతించాలని కోర్టును కోరింది.ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్ పై సీబీఐ కోర్టు నిందితుల స్పందన కోరింది.

కాగా సీబీఐ పిటిషన్ పై కోర్టు జూన్ 2వ తేదీన విచారణ జరపనుంది.అయితే వివేకా లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్ కు పంపింది.

Advertisement

దీంతో వివేకా ఒత్తిడిలో రాసిన లేఖని ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చిన విషయం తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement