వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు..!!

సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం తెలిసిందే.అప్పట్లో ఈ హత్య ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.

ఆ టైంలో  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో వైసీపీ వాళ్లు తీవ్ర ఆరోపణలు చేశారు.ఇక ఇదే సమయంలో సానుభూతి కోసం వైసీపీ వాళ్ళే చంపారని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు మూడు సంవత్సరాలు నుండి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా మొదటినుండి ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో వైయస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

Advertisement

వివేక హత్య కేసుకు సంబంధించి జనవరి 24 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు