పిల్లికి తన పిల్లలపై ఎంత శ్రద్ధ ఉందో చూడండి.. మనుషులకే లేదా..?

మనుషులే కాదు.జంతువులు కూడా తమ బిడ్డలను ప్రేమగా చూసుకుంటాయి.

వాటికి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తాయి.

కాస్త పెరిగేంతవరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.

వేరే జంతువులు దాడి చేయకుండా పిల్లలను రక్షించుకునేందుకు వాటిని కనిపెట్టుకునే ఉంటాయి.వాటిని తమ ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమగా చూసుకుంటాయి.

తాజాగా ఓ పిల్లి( Cat ) తన పిల్లల పట్ల చూపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

ఓ పిల్లి తన పిల్లలను ఒకచోట ఉంచింది.కానీ ఒక గడుసు పిల్లి పిల్ల అక్కడ నుంచి వేరేచోటకు వెళ్లిపోయింది.పిల్లలకు ఆహారం కోసం బయటకు వెళ్లిన తల్లి పిల్లి( Mother Cat ) తర్వాత వచ్చేసరికి తన పిల్లల్లో ఒకటి మిస్ అయినట్లు గమనించింది.

దీంతో వెంటనే మిస్ అయిన పిల్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించింది.చివరకు తన పిల్ల ఒకచోట కూర్చోని కనిపించింది.దీంతో కోపంతో ఆ పిల్లిని తల్లి పిల్ల కొట్టింది.

పిల్లను దారిలో పెట్టేందుకు తల్లి పిల్ల ఇలా చేసింది.ఈ పిల్లి తన పిల్లలపై పెట్టిన శ్రద్ధకు అందరూ ఫిదా అవుతున్నారు.

పిల్లి తన పిల్లలపై పెట్టిన శ్రద్ధలో కొంచమైనా ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టడం లేదని కొంతమంది అంటున్నారు.బిజీ లైఫ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప పిల్లల గురించి పట్టించుకోవడం లేదు.పిల్లల బాగోలను కేర్ టేకర్స్ కి ( Care Takers ) అప్పగిస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం కూడా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు.దీంతో చాలామంది పిల్లలు చెడుదారి పడుతున్నారు.

Advertisement

వారిని మందలించేవారు లేకపోవడంతో తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు.ఈ పిల్లి వీడియో తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా ఉంది.

తాజా వార్తలు