హెచ్‎సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదు

హెచ్‎సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదు అయింది.

ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వర రావు కమిటీ అజారుద్దీన్ పై ఫిర్యాదు చేసింది.నిధుల గోల్ మాల్, సామాగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆడిట్ రిపోర్టు వచ్చింది.

ఈ నేపథ్యంలో జిమ్ ఎక్విప్ మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్ మెంట్, క్రికెట్ బాల్స్, ఛైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్ తో పాటు జాన్ మనోజ్, విజయానంద్ పై కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో నలుగురు హెచ్‎సీఏ మాజీల మీద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు