స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే.
త్వరలో బాలయ్య టర్కీ షెడ్యూల్ ను ముగించుకుని ఇండియాకు రానున్నారు.
ప్రస్తుతం బాలయ్య హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో తాజాగా హిజ్రాలు ఆయనపై కేసు పెట్టారు.
తాజాగా సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చగా సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫైర్ అయిన సంగతి తెలిసిందే.బాలయ్య జగన్ పై, జగన్ సర్కార్ పై చేసిన కామెంట్ల విషయంలో ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు.
అయితే నియోజకవర్గంలో బాలకృష్ణ ఉండటం లేదని హిజ్రాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.గతంలో కూడా బాలయ్యపై ఈ తరహా ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.
బాలకృష్ణ నియోజకవర్గంలో ఉండటం లేదని బాలకృష్ణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని హిజ్రాలు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
అయితే ఎవరో కావాలనే బాలయ్యపై ఈ తరహా ఫిర్యాదులు చేయిస్తున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండటం లేదని కేవలం బాలయ్యను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు బాలయ్య వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాలయ్య సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా స్టార్ డైరెక్టర్లు బాలయ్య ప్రాజెక్ట్ లకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.సినిమాసినిమాకు నటుడిగా బాలయ్య రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో బాలయ్య కావడం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy