ఏలూరు జిల్లాలో కారు బీభత్సం.. నలుగురు బలి

ఏలూరు జిల్లా కామవరపుకోట సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.రెండు బైకులతో పాటు ఓ కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.వెంటనే స్పందించిన స్థానికులు భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో భర్త చనిపోగా.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతిచెందింది.

ఘటనకు మద్యం సేవించి కారు నడపడే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి, కారు యజమాని బాలగంగాధర్ రావును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు