ఈ ఆలయంలో డబ్బే ప్రసాదంగా పంచుతారు.. ఎక్కడంటే..

మన భారతదేశంలో చాలా సంవత్సరాల నాటి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.ఒక్కో ప్రాంతాన్ని బట్టి ప్రజలు ఒక్కోరకంగా ఆలయంలోని సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.

కొన్ని ఆలయాలలో ప్రసాదంగా మిఠాయి కానీ, పులిహోర కానీ భక్తులకు పంచుతూ ఉంటారు.ఈ సంవత్సరం ప్రభావం కోవిడ్ ప్రభావం తగ్గినందువల్ల అందరూ ఎంతో సంతోషంగా పండువులను జరుపుకుంటూ ఆలయాలకు వెళ్లి వస్తున్నారు.

సాధారణంగా ఆలయానికి వెళ్ళిన భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలు ఇస్తూ ఉంటారు.కానీ ఈ గుడిలో మాత్రం ప్రసాదంగా డబ్బులు పంచుతారు.

ఇలా మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది.దీపావళి రోజు భక్తులకు ప్రసాదానికి బదులుగా డబ్బులు పంచారు.

Advertisement
Cans Are Distributed As Prasad In This Temple Where , Temple ,gift ,money,Amarav

అలా పండుగ రోజు డబ్బులను పంచితే భక్తులకు మంచి జరుగుతుందని శక్తి మహారాజ్ పూజారి చెప్పారట.ఈ ఆచారం 1984లో ప్రారంభమైందని ఆ పూజారి చెప్పారు.

కాళీమాత అమ్మవారి పాదాల వద్ద పది రూపాయల నోట్లు నింపిన ఒక గిన్నె ఉంచి, ఆ గిన్నెలో నుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజారి ఒక్కొక్కరికీ రెండు మూడు నోట్లు ఇచ్చారు.పండుగ రోజు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులకు ఈ ప్రసాదాన్ని పంచిపెట్టారు.

అమ్మవారి పాదాల వద్ద ఉంచిన ప్రసాదాన్ని పొందడానికి భక్తులు వరుసలో వచ్చారు.దాంతో అక్కడ వాతావరణం సందడిగా మారిపోయింది.

ఈ ఆలయం మహారాష్ట్రలోని హిందూ స్మశాన వాటిక కు దగ్గరలో ఉన్న ఎన్నో సంవత్సరాల నాటి ఆలయం.ఈ ఆలయాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించాలని ఆ దేవాలయం ప్రధాన పూజారి శక్తి మహారాజ్ చెబుతున్నారు.

Cans Are Distributed As Prasad In This Temple Where , Temple ,gift ,money,amarav
పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

అదేవిధంగా ఈ దేవాలయంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనే ప్రధాన పూజారిగా కొనసాగుతున్నట్లు కూడా చెప్పారు.అప్పటి నుంచే ఈ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు.దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకుని రాత్రి 10 గంటల సమయంలో భక్తులు అమ్మవారి ఆలయానికి వెళ్తారు ఈ ప్రసాదం దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారు ఇచ్చే కానుకగా భక్తులు భావిస్తారని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు