నిత్యం పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా?

పాలు( milk ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మ‌న శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండ‌టం వ‌ల్ల చాలా మంది నిత్యం పాలు తాగుతుంటారు.

అయితే పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని కొంద‌రు నమ్ముతుంటారు.ఈ క్ర‌మంలోనే పాలును పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు.

అస‌లు నిజంగా పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా అంటే.అది ఎలా తాగుతారు, ఎన్ని పాలు తాగుతారు, మీ శరీర శ్రమ మరియు ఇతర ఆహార‌పు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే అధిక కొవ్వు మరియు కేలరీలను క‌లిగి ఉంటాయి.రోజువారీ అవసరానికి మించి ఈ పాలును తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

Advertisement

లో-ఫ్యాట్ మిల్క్( Low-fat milk ) అంటే తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటాయి.ఇవి బరువు పెరగకుండా దారితీయ‌వు.

అలాగే పాలను తగిన పరిమాణంలో తాగితే బరువు పెరగడం అనేది సాధారణంగా జరగదు.కానీ ఎక్కువగా తాగితే అధిక కేలరీలు శరీరంలో నిల్వగా మారి బరువు పెరగవచ్చు.

పాలలో చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు అన‌గా బాదం పౌడర్, చాక్లెట్ సిరప్ ( Almond powder, chocolate syrup )వంటివి కలిపితే కేలరీలు పెరుగుతాయి.ఇలా తాగే పాలు బరువు పెరగడంలో ప్రభావం చూపవచ్చు.పాలు తాగి శరీర శ్రమ చేయకుండా ఉంటే కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.

వ్యాయామం చేసేవారు పాలు తాగితే అదనపు కేలరీలు బ‌ర్న్ అవుతారు.దాంతో బ‌రువు పెర‌గ‌డం అనేది జ‌ర‌గ‌దు.

తండేల్ పై బన్నీ వివాదం ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైందిగా!
ఈ అమ్మవారిని దర్శించుకుంటే సర్వ రోగాలు మాయం..!

బరువు పెరగకుండా ఉండాలంటే పరిమిత కొవ్వు పాలును ఎంచుకోవాలి.అలాగే రోజుకు ఒక‌టి లేదా రెండు గ్లాసుల పాలును మాత్ర‌మే తీసుకోవాలి.శ‌రీరానికి శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి.

Advertisement

మ‌రియు సరైన ఆహార పద్ధతులు పాటించాలి.ఇక నిత్యం పాలు తాగడం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు దృఢంగా మ‌రియు ఆరోగ్యంగా మార‌తాయి.

పాలలో ఉన్న ప్రోటీన్లు శరీర కండరాల పెరుగుదలకు మరియు శక్తి ఉత్పత్తికి దోహదపడతాయి.రక్తపోటు నియంత్రణకు, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి పాలు అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.

తాజా వార్తలు