సామ్ ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా... నెటిజన్ ప్రశ్నకు సమంత సమాధానం ఇదే!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత( Samantha ) ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

అదే విధంగా తాను నటించిన శాకుంతలం ( Shaakunthalam ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా సమంత ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమ( Suma )తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Can Sam Date Anyone This Is Samantha Answer To A Netizens Question ,samantha , S

ఇక సమంత నాగచైతన్య( Nagachaitanya )ను ప్రేమించి పెళ్లి చేసుకొని అతనితో విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఒంటరిగా తన సినీ కెరియర్లో ముందుకు సాగుతున్నటువంటి సమంతకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

Advertisement
Can Sam Date Anyone This Is Samantha Answer To A Netizens Question ,Samantha , S

అయితే శాకుంతలం ఇంటర్వ్యూలో భాగంగా ఒక నెటిజన్ తనను అడిగిన ప్రశ్న గురించి సమంత ఈ సందర్భంగా బయటపెట్టారు.

Can Sam Date Anyone This Is Samantha Answer To A Netizens Question ,samantha , S

ట్విట్టర్ వేదికగా ఒక నెటిజన్ తనకు ట్వీట్ చేస్తూ సమంత ఇప్పుడు ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు కదా అంటూ తనని ప్రశ్నించారని ఈమె తెలియజేశారు.ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత చెప్పిన సమాధానాన్ని కూడా తెలియజేశారు.ప్రశ్నకు రిప్లై ఇచ్చిన సమంత మీలా నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ ఈమె హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.

ఇలా సమంత రిప్లై ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మేం రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు