థైరాయిడ్ ఉన్నవారు టీ, కాఫీ తాగవచ్చా.. తప్పకుండా తెలుసుకోండి!

థైరాయిడ్( Thyroid ).ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

ఇర‌వై ఏళ్ల వారు సైతం థైరాయిడ్ బారిన పడుతున్నారు.ముఖ్యంగా థైరాయిడ్ అనేది పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా తలెత్తుతుంది.

గొంతు ముందు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది.ఈ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది.

ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతే హైపో థైరాయిడ్( Hypothyroid ) అని అంటారు.ఒకవేళ అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడ్.

Advertisement

థైరాయిడ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది.ఇకపోతే థైరాయిడ్ ఉన్నవారు టీ, కాఫీ తాగవచ్చా.? తాగకూడదా.? అనే డౌట్ చాలా మందికి ఉంది.వాస్తవానికి పైన చెప్పుకున్నట్లు థైరాయిడ్ లో రెండు రకాలు.

ఒకటి హైపో థైరాయిడ్ కాగా.మరొకటి హైపర్ థైరాయిడ్.

హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లు కాఫీ, టీ తాగకపోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే టీ, కాఫీ( Tea, coffee )లో ఉండే కెఫిన్ థైరాయిడ్ గ్రంథిని మరింత ఉత్తేజ పరుస్తుంది.

దీని కారణంగా హైపర్ థైరాయిడ్ లక్షణాలు తీవ్రతరంగా మారుతాయి.అలసట, అతిసారం, బరువు తగ్గిపోవడం, అతి ఆకలి, గుండె దడ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

అందుకే హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లు టీ కాఫీ ని దూరం పెట్టాలి.

Advertisement

ఇక హైపో థైరాయిడ్ ఉన్నవారు మాత్రం టీ, కాఫీ ని తీసుకోవచ్చు.కానీ రోజుకు ఒక కప్పుకు మించకూడదు.హైపో థైరాయిడ్ ఉన్నవారు పరిమితంగా టీ, కాఫీ ని తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు .పైగా థైరాయిడ్ గ్రంథి( Thyroid gland ) పనితీరు కూడా మెరుగుప‌డుతుంది.కానీ అతిగా తీసుకుంటే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్త.

తాజా వార్తలు