మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఎండాకాలంలో పుచ్చకాయను తినవచ్చా..?

ఎండాకాలంలో పుచ్చకాయ, మామిడికాయలకు( Mangoes ) ఎంతో డిమాండ్ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

అలాగే పొట్టకు కూడా చల్లగా అనిపిస్తుంది.కానీ పుచ్చకాయను షుగర్ పేషెంట్స్ తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఇది మరి అంత తీయగా ఉండదు.కాబట్టి తినవచ్చులే అని కొంత మంది అనుకుంటూ ఉంటారు.

దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.పుచ్చకాయలో నీరు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

Advertisement

అయినప్పటికీ ఇది కొంచెం ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది.అంటే 100 గ్రాముల పుచ్చకాయలు జిఐ 72 ఉంటుంది.

కాబట్టి డయాబెటిక్ రోగులు( Diabetic Patients ) ఒక కప్పు పుచ్చకాయను తినవచ్చు.ముఖ్యంగా పుచ్చకాయను షుగర్ వ్యాధిగ్రస్తులు అల్పాహారంగా మాత్రమే తినాలి.భోజనం వలె అసలు తినకూడదు.

అలాగే రాత్రి పూట పుచ్చకాయ తినకూడదు.ఇంకా చెప్పాలంటే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే పుచ్చకాయ తినకూడదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం లేదా సాయంత్రం పుచ్చకాయ( Watermelon ) తినడం మంచిది.ఎండాకాలంలో పుచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్( Hydration ) మరియు చల్లదనం లభిస్తుంది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఈ పండులో విటమిన్ సి, ఏ, బి6 వంటి పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పోలేట్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.అలాగే పుచ్చకాయ తినడం వల్ల బరువు( Weight Loss ) త్వరగా తగ్గుతారు.అలాగే జుట్టు కూడా దృఢంగా ఉంటుంది.

చర్మాన్ని ఇది మృదువుగా మారుస్తుంది.మూత్రం నాళాల ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్లలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్( Cherries ), కివి, జామ, నారింజ, బోప్పాయి లాంటి పండ్లు ఉన్నాయి.ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని కాస్త తక్కువగా తినడమే మంచిది.

తాజా వార్తలు