పాలని ఇలా తీసుకుంటే మధుమేహాన్ని అదుపు చేయవచ్చా?

ఈ మధ్య కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.వృద్ధులతో పాటు యువతను కూడా ఈ మధుమేహం పట్టి పీడిస్తోంది.

ఈ ప్రమాదకర జబ్బు నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి.షుగర్ పేషంట్లు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

అయితే ఈ రోగం శరీరం లో ఉన్నట్లు చాలామందికి తెలియడం లేదు.ఈక్రమంలో డయాబెటిస్‌ గురించి ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

దీని ప్రకారం రోజూ ఒక గ్లాస్‌ పాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ జబ్బును తగ్గించుకోవచ్చు.అయితే రోజూ ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల 10 శాతం మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని ఈ పరిశోధన లు చేసిన సైంటిస్టులు తెలిపారు.

Advertisement
Can Diabetes Be Controlled By Consuming Milk Like This ,milk, Diabetes , Health

అలాగే రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే సామర్థ్యంతో పాటు అనేక పోషకాలు పాలలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.

Can Diabetes Be Controlled By Consuming Milk Like This ,milk, Diabetes , Health

అయితే మధుమేహాన్ని త్వరగా గుర్తించడం ఎంతో ముఖ్యం.లేకపోతే ఇది మన కళ్లు, గుండెకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగితే కంటి సమస్యలు వచ్చి, అంధత్వం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా ప్రాణాంతక స్ట్రోక్, గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 కోట్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారనీ తెలిసింది.

దీనికి కారణం మనం తీసుకునే ఆహారం.ఈనేపథ్యంలో పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ఈ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

అలాగే పాల ఉత్పత్తిలో 200 గ్రాములు ఈ వ్యాధిని 5 శాతం తగ్గిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.అదే విధంగా పాల ఉత్పత్తులలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

ఇవి గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజా వార్తలు