యాచించిన చోటే కేఫ్ న‌డుపుతోంది.. ఈ చిన్నారి గాథ ఎంద‌రికో స్ఫూర్తి

జీవితం గెలుపుకు నాంది కావాలి గానీ.ఓడిపోయిన ప్ర‌తిసారి కుంగిపోకూడ‌దు.

గెలుస్తామా అనే అనుమానం కంటే కూడా పోరాడాలి, ప్ర‌య‌త్నించాలి అనే త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో చాలా ముఖ్యం.

మీరు విన్న‌ది నిజ‌మేనండోయ్‌.

ఎందుకంటే చాలా మంది ఇలా ప్ర‌య‌త్నించి త‌మ జీవితాల్లో స‌క్సెస్ అయిన వారు అనేక మంది ఉన్నారు.ఇలాంటి వారి జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం.

ఓట‌మిలో ఉన్న వారు ఇలాంటి వారి జీవితాల‌ను ఆధారంగా చేసుకుంటే.క‌చ్చితంగా జీవితంలో స‌క్సెస్ అవుతారు.

Advertisement
Cafe Is Running Where Begging This Little Story Is An Inspiration To Many, Ama

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ బాలిక గురించే మీకు చెప్ప‌బోతున్నాం.బీహార్ స్టేట్ లోని పాట్నా ప‌ట్ట‌ణానికి చెందిన‌టువంటి ఓ చిన్నారి త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయింది.

ఇలా జీవితం త‌న‌ను వెక్కిరించినా స‌రే ఏ మాత్రం అధైర్యంగా ఉండ‌కుండా.త‌న క‌ష్టాన్ని న‌మ్ముకుని నిల‌బ‌డ్డ‌ది.

చివ‌ర‌కు త‌ను అనుకున్న‌ది సాధించింది.ఇక చిన్న‌ప్ప‌టి నుంచే అనాథ కావ‌డంతో.

యాచిస్తూ జీవిస్తోంది.ఇలా వ‌చ్చిన కొద్దో గొప్పో డ‌బ్బుల‌తోనే జీవిస్తూ వ‌స్తోంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

భిక్షాట‌న చేయ‌డంతో పాటు చెత్తను కూడా ఏరుకుని డ‌బ్బులు సంపాదించేది.అయితే చ‌దువు మాత్రం ఆమెకు అంద‌నంత దూరంలోనే ఆగిపోయింది.

Cafe Is Running Where Begging This Little Story Is An Inspiration To Many, Ama
Advertisement

కాగా. రాంబో ఫౌండేషన్ ద్వారా చ‌దువుకోవ‌డం స్టార్ట్ చేసింది.ఇలా చ‌దువుకుంటూనే ఆమె మిగ‌తా ప‌నుల‌పై కూడా దృష్టి పెట్టింది.

జీవితంలో ఏదో ఒక‌టి సాధించాల‌నేది ఆమె క‌ల‌.ఇందుకోసం పెయింటింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంది.

దాంతో పాటు ఒక పెద్ద కంపెనీలో కేఫ్ నడిపే జాబ్ కూడా సంపాదించింది.ఒక‌ప్పుడు తాను యాచించిన చోటే.

ఇప్పుడు ఆ కేఫ్ ను న‌డుపుతోంది.అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే చ‌దువుకుంటోంది.

ఇప్పుడు జ్యోతి అద్దె ఇంట్లో నివ‌సిస్తోంది.రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ చేయాల‌ని అనుకుంటోంది.

" autoplay>

తాజా వార్తలు