నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల అప్పుల నుంచి విముక్తి పొందుతారా..

మనదేశంలో దసరా పండుగను ప్రజలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని అన్ని రూపాలలో పూజిస్తూ ఉంటారు.

దుర్గామాత అనుగ్రహం కోసం కఠినమైన ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు.నవరాత్రులను శక్తివంతమైన పండుగ అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు.

నవరాత్రులలో కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తూ దుర్గా దేవిని పూజిస్తే అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం.దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నియమాలతో కూడిన పూజలు చేయాలి.9 రోజులు 5 రకాల డ్రై ఫుడ్స్ తో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాలి.ఆ తరువాత పూజ చేసి ఆ ప్రసాదాన్ని మీరే తినాలి.

చేయడం వలన చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.నవరాత్రులలో ప్రతిరోజు నెయ్యి దీపంలో 4 లవంగాలు వేసి ఉదయం, సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించాలి.

Advertisement

ఇలా చేయడం వల్ల మన కుటుంబంపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది.మరి కొంతమంది భక్తులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నవరాత్రులలో వెండి స్వస్తిక, కలశం ఏనుగు కిరీటం ఇలాంటి చాలా రకాల వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అమ్మవారి పాదాల చెంత వీటిని ఉంచి నవరాత్రుల చివరి రోజు వీటిని గులాబీ వస్త్రంలో కట్టి మీ ఇంట్లో ఉన్న బంగారం లో కానీ డబ్బులను కానీ భద్రపరచాలి అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని భక్తుల నమ్మకం

మనం తీసుకున్న అప్పులు త్వరగా తీరిపోవాలంటే నవరాత్రులలో మంగళవారం రోజున తమలపాకు పై లవంగాలు ఎలుకలు వేసి ఒక పాన్ ను తయారు చేసుకోవాలి ఆ తరువాత హనుమంతుడికి నైవైద్యంగా సమర్పించాలి.ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుందని వారు నమ్మకం.ఇలా చేసేటప్పుడు హనుమంతుని పాదాలకు తమలపాకు తాకకుండా ఉంచాలి.

ఇలా చేస్తే జీవితంలో సుఖ సంపదలు ఆ ఇంటికి వస్తాయని నమ్ముతారు .

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు