బివిఎస్ రవి నెక్స్ట్ సినిమా ఆ హీరో తో చేయబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రైటర్స్ లో కొందరు చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు దానికి కారణం ఏంటి అనేది ఎవ్వరికి తెలీదు.

అలాంటి కోవకి చెందిన వాడే రైటర్ బివిఎస్ రవి( Bvs ravi ) ఈయన రైటర్ గా చేసిన కొన్నిసినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి కానీ ఈయన డైరెక్టర్ గా చేసిన వాంటెడ్, జవాన్ సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి ఎందుకు ఆయన డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోయారు అంటే ముఖ్యంగా ఆయనకి స్టోరీ మీద మంచి గ్రిప్ ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే మీద మాత్రం పట్టు లేదనే చెప్పాలి.

రెండు సినిమాలు కూడా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్లే ప్లాప్ అయ్యాయి అనే విషయం ఆ సినిమాలు చూస్తే మనకు అర్థం అవుతుంది.

Bvs Ravi Going To Do Next Movie With Nagarjuna , Bvs Ravi , Nagarjuna, Tollywoo

రీసెంట్ గా నాగచైతన్య హీరో గా, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన థ్యాంక్ యూ( Thank You ) అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.అయితే ఈ సినిమాకి కథ ఇచ్చింది బివిఎస్ రవి గారే కావడం విశేషం.ఈ సినిమా ప్లాప్ తో ఆయన కెరియర్ మళ్లీ చాలా వెనక్కి వెళ్ళిపోయింది అని అందరు అనుకున్నారు కానీ ఆయన ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఎలా అంటే రీసెంట్ గా ఆయన నాగార్జున కి ఒక కథ చెప్పారట అది నాగార్జునకి ( Nagarjuna )విపరీతంగా నచ్చిందట దాంతో నాగార్జున ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కానీ ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని బివిఎస్ రవి నే డైరెక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

చూడాలి మరి నాగార్జున రవి కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారో లేదో.

Advertisement
BVS Ravi Going To Do Next Movie With Nagarjuna , Bvs Ravi , Nagarjuna, Tollywoo
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

తాజా వార్తలు