రైలు నిండా దొంగలే ..

దొంగలు మరోమారు రెచ్చిపోయారు.పట్టాలపై కదులుతున్న రైలులో దోపిడీకి పాల్పడ్డ దొంగలు ఆ తర్వాత చైన్ లాగి రైలును ఆపేసి దర్జాగా దిగిపోయారు.

భువనేశ్వర్-బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకెళితే.

ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు రాగానే అప్పటికే అందులోకి చొరబడ్డ దొంగలు నానా బీభత్సం సృష్టించారు.ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు ఓ మహిళ మెడలోని చైన్ ను లాగేసుకున్నారు.

ఆ తర్వాత చైన్ లాగి రైలును ఆపేసి దర్జాగా దిగిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే దొంగలు పరారయ్యారు.

Advertisement
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

తాజా వార్తలు