బన్నీ సాంగ్ చింపేసింది అంటున్నారు

అందరూ హీరోలూ పాటలు పడేస్తూ ఉంటే పాపం బన్నీ బాబు కి కూడా ఏదో ఒక సినిమాలో పాట పడాలి అనిపించినట్టు ఉంది.

సరైనోడు లో బన్నీ ఒక సాంగ్ పాడుతున్నాడు అన్న విషయం ఇదివరకే ప్రకటించాం అయితే ఈ పాట కి సంబంధించిన విశేషాలు మనకి చాలా అందుతున్నాయి.

తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ సినిమాలో సాంగ్ సాధారణమైన సాంగ్ కాదు అని చెబుతున్నాయి చిత్ర వర్గాలు.మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాట కోసం తమన్ చాలానే కష్టపడ్డాడు అని అంటున్నారు .

చెన్నై లో ప్రస్తుతం రీరికార్డింగ్ కూడా పూర్తి చేసుకున్న పాట బన్నీ కి బాగా సెట్ అయ్యిందట.ఫుల్ ఎనర్జీ ఉండే ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ థీమ్ తో కంపోజ్ చేసిన పాట కోసం బన్నీ పాడాడని అంటున్నారు.

హై ఓల్టేజ్ మ్యూజిక్ ఉండే ఈ పాటలో బన్నీ ఒక్కడే కాదు.ఎంసీ విక్కీ ఎంఎం మానసి వాయిస్ లు కూడా వినిపిస్తాయట.అంతే కాదు.

Advertisement

తమన్ కూడా కొన్ని బిట్స్ పాడానని చెబుతున్నాడు.వేదం సినిమాలో రెండు మూడు లైన్ లు పాడిన బన్నీ కి ఫుల్ సాంగ్ పాడడం ఇదే తొలిసారి.

.

Advertisement