భరత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దిగ్విజయంగా పురస్కరించుకున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ (భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తమ వినియోగదారులకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
అవును, బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కొసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్( Bharat Fiber Amrit Utsav ) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఇపుడు హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
ఆయా కస్టమర్లు ఉచితంగానే ఇంటర్నెట్ స్పీడ్ 100 ఏంబీపీఎస్( 100 Mbps ) వరకు పెంచుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.అయితే, ఈ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను కేవలం 10 రోజులు పాటు మాత్రమే వినియోగించుకోవచ్చని తెలపడం కొసమెరుపు.
ఇక ఈ ఆఫర్ నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్( BSNL ) వెల్లడించింది.ఎప్పటినుండి ఎప్పటివరకంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మాత్రమే ఈ ఆఫర్ పొందవచ్చు.కాబట్టి ఈ పరిమితకాల ఆఫర్ ఇప్పుడే పొందండి.
ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ ఎఫ్‌టీటీహెచ్ సర్కిల్‌లో ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు వెల్లడించింది.నెల వారీ రూ.449, రూ.499, రూ.599, రూ.666 రీఛార్జితో సర్వీసులు పొందుతూ ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులు అని తెలిపింది.
దీనికోసం బ్రాడ్ బ్యాండ్ యూజర్లు( Broadband Users ) ముందుగా మై బీఎస్‌ఎన్‌ఎల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అవ్వాలి.ఆ తర్వాత అందులో ఎఫ్‌టీటీహెచ్ అకౌంట్ నంబర్ యాడ్ చేసిన తరువాత మీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌కు ఇంటర్నెట్ స్పీడ్( Internet Speed ) పెంచుకొనేందుకు అర్హత ఉందో లేదో అక్కడ తెలుపుతుంది.అర్హత లేకపోతే ఇక కష్టం.
కానీ మీరు అర్హులైతే మీ ఎఫ్‌టీటీహెచ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.దానిని ఎంటర్ సాయడం ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన 48 గంటల్లోనే మీ ఇంటర్నెట్ స్పీడ్ 100Mbps వరకు పెరుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy