వికారాబాద్ జిల్లా పరిగిలో యువతి దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.పరిగి మండలంలో ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

కడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీషా రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది.ఉదయం గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో శవమై కనిపించింది.

శిరీషా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యువతి మృతదేహంపై కత్తి పోట్లు ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...

Latest Latest News - Telugu News