Bruce Lee : బ్రూస్ లీ మరియు అతడి కొడుకు మరణం వెనక విస్తుపోయే నిజాలు !

బ్రూస్ లీ( Bruce Lee ) ప్రపంచానికి వన్ ఇంచ్ పంచ్ ని పరిచయం చేసి నేను మార్షల్ ఆర్ట్స్ ( Martial arts ) లో దాన్ని ఒక భాగంగా మార్చడం లో కృషి చేసిన ఒక నటుడు మరియు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు.

అమెరికా లో పుట్టిన బ్రూస్ లీ హాంకాంగ్ లో పెరిగాడు.

తండ్రి తో కలిసి చిన్నతనం నుంచి నటించడం మొదలు పెట్టి హీరో గా కెరీర్ ని మల్చుకున్నారు.చైనా సంప్రదాయాలను తన సినిమాల ద్ద్వారా బాగా చూపించి ప్రజల మన్ననలు పొందాడు.

ఇక బ్రూస్ లీ చనిపోయే సమయానికి అతడు వయసు కేవలం 32 ఏళ్ళు.హీరోగా తాను నటించిన 5 వ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అతడి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన అతడి ఐదవ సినిమా ఎంటర్ ది డ్రాగన్( Enter the dragon ) .

Advertisement

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయిన బ్రూస్ లీ అప్పుడు కోలుకున్న మరి కొన్ని రోజులకు నిద్రలోనే తుది శ్వాస విడిచాడు.బ్రూస్ లీ చనిపోయే సమయానికి అతనికి ఇద్దరు పిల్లలు.కొడుకు బ్రాండన్ లీ( Brandon Lee ), కుమార్తె షానోన్ లీ( Shannon Lee ).బ్రూస్ లీ మాదిరిగానే కొడుకు బ్రాండన్ లీ కూడా సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు.సరిగ్గా తన తండ్రి మరణం లాగానే బ్రాండన్ లీ మరణం కూడా సంభవించడం చైనా దేశస్థులను షాక్ కి గురి చేసింది.

సరిగ్గా బ్రాండన్ లీ తన కెరీర్ లో ఐదవ సినిమా చేస్తున్నాడు.అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కతుంది.ఆ సమయంలో బ్రాండన్ వయసు కేవలం 28 ఏళ్ళు.

షూటింగ్ లో విలన్ హీరో పైకి గన్ తో కాల్చాలి.నకిలీ తుపాకీ అయినప్పటికీ దానిలో ఉన్న టెక్నీకల్ సమస్య వలన దాంతో బ్రాండన్ ని కాల్చగానే కుప్పకూలిపోయాడు.ఆసుపత్రి కి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.

ఇక తండ్రి కొడుకు ఇద్దరు కూడా తమ భారీ బడ్జెట్ చిత్రం అయినా ఐదవ సినిమా మధ్యలోనే కన్ను మూసారు.బ్రూస్ లీ లాంటి ఒక యోధుడిని ప్రపంచం కోల్పోయింది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఇక బ్రూస్ లీ సమాధి పక్కనే బ్రాండన్ లీ సమాధి ని కూడా ఏర్పాటు చేసారు.

Advertisement

తాజా వార్తలు