కాంగ్రెస్ బలమా.. బి‌ఆర్‌ఎస్ బలహీనమా ?

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎప్పుడు ఏ పార్టీ బలహీన పడుతుందో.

ఏ పార్టీ బలం పెంచుకుంటుందో అంచనా వేయడం కష్టంగా మారింది.

నిన్న మొన్నటివరకు పూర్తిగా డీలా పడిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఇప్పుడు జెట్ స్పీడ్ లో పుంజుకుంది.

ఇక ఆ మద్య నానా హడావిడి చేసిన బీజేపీ కొంత స్లో అయింది.అటు అధికార పార్టీ బి‌ఆర్‌ఎస్( BRS ) పరిస్థితి ఎటు చెప్పలేని విధంగా ఉంది.

పైపైకి విజయం మాదే అని బి‌ఆర్‌ఎస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా.లోలోపల కొంత సందేహం గానే ఉన్నారనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.వైరల్ అవుతున్న ఈ మాటలకు బలం చేకూరుస్తూ అధికార బి‌ఆర్‌ఎస్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వాకౌట్ చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు పెరుగుతుంటాయి.కానీ ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ నుంచి నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ లోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ గట్టిగానే గాలం వేస్తోంది.

బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,( Ponguleti Srinivas Reddy ) జూపల్లి కృష్ణారావ్( Jupalli Krishna Rao ) వాటి వారికి ఆశ్రయమిచ్చింది.ఇంకా వీరు మాత్రమే కాకుండా బి‌ఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్ రెడ్డి తనయుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి వంటి వారు సైతం హస్తం గూటికి చేరారు.

ఇక ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prasanth Reddy ) బి‌ఆర్‌ఎస్ వీడే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి వేములకు టికెట్ ఇచ్చే ఆలోచనలో కే‌సి‌ఆర్ లేడట.

అందుకే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు టాక్.ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా సిఎల్పీ కార్యలయంలో ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే వాదన పెరుగుతోంది.ఇక వేముల దారిలోనే మరికొంత మంది బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

దీంతో బి‌ఆర్‌ఎస్ బలహీన పడుతోందా లేదా కాంగ్రెస్ బలం పెంచుకుంటోందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.మొత్తానికి ఎన్నికల వేల కాంగ్రెస్ మరియు అధికార బి‌ఆర్‌ఎస్ మద్య వలసల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.

తాజా వార్తలు