ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు లీ మెరిడియన్ హోటల్ లో ఈ భేటీ జరగనుంది.కాగా ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనున్నారు.

కవిత ఇటీవల చేపట్టిన నిరాహార దీక్షకు కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని భారత్ జాగృతి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రేపు ఈడీ ఎదుట రెండో సారి విచారణకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు