ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

( CM Revanth Reddy ) ఇప్పటికే 10 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.

త్వరలోనే బిఆర్ఎస్ ఎల్ పి కాంగ్రెస్ లో విలీనం అవుతుందని , ఇక ఆ పార్టీలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్ లో చేరిపోతారని ధీమాగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ నేతల ఆశలు తీరేలా కనిపించడం లేదు.ప్రస్తుతానికి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ముందుగా సిద్ధమైనా.

  ఇప్పుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారట.దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఇప్పటికే 10 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చెరిపోవడంతో మిగతా ఎమ్మెల్యేలు ఎవరు చెజారిపోకుండా  బీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచించింది.

Advertisement

ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) మరో కీలక నేత హరీష్ రావు రంగంలోకి దిగి ఎవరు పార్టీని వీడకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలతో నేరుగా కేసీఆర్ మాట్లాడడం వంటి పరిస్థితుల్లో నేపథ్యంలో చేరికలు నిలిచాయి.ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది .కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయాలు( Telangana politics ) మారిపోతాయని,  కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది అని బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  బిజెపి తో జరుగుతున్న చర్చల గురించి బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్యేలకు లీకులు ఇస్తోంది.

మరికొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చేద్దామని ఈ విషయంలో బిజెపి కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని ఎమ్మెల్యేలకు సర్ది చెబుతున్నారు.

బిజెపిలో బీఆర్ఎస్ విలీనం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.  బీఆర్ఎస్ పెద్దలు సైలెంట్ గానే ఉంటున్నారు.ఒకవేళ బీఆర్ఎస్ కు బిజెపి మద్దతు ఇచ్చినా లేక బీఆర్ఎస్ బిజెపిలో విలీనం అయినా తాము రాజకీయంగా దెబ్బతింటామనే ఆలోచనతో చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారట.

మరి కొంతకాలం వేచి చూస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారట.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికలు ఇప్పట్లో లేనట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అతని ఎవరు బయటకు గెంట లేదు... క్లారిటీ ఇచ్చిన నాగ మణికంఠ చెల్లెలు!
Advertisement

తాజా వార్తలు