చెల్లెలికి మ్యాథ్స్ చెప్పలేక అన్న ఏడుపు.. ఫన్నీ వీడియో వైరల్!

మానవ జీవితంలో మాథ్స్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం మాథ్స్ నంబర్స్‌ ఉపయోగించకుండా ఉండలేం.

అందుకే చిన్నప్పటినుంచి మాథ్స్ బాగా నేర్చుకోవాలని టీచర్లు, తల్లిదండ్రులు చెబుతుంటారు.అయితే చాలామంది పిల్లలు మ్యాథ్స్ హోంవర్క్ చేయలేక జుట్టు పీక్కుంటుంటారు.

కాగా తాజాగా ఓ చిన్నారి కూడా మాథ్స్ హోమ్ వర్క్ ఫినిష్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోయింది.ఈ సమయంలో తన అన్నయ్య హెల్ప్ తీసుకుంది.

కాగా మాథ్స్ నేర్పించే సమయంలో ఆ అన్నయ్య ఒక్కసారిగా గుక్క పట్టి ఏడ్చాడు.తన చెల్లెలికి మాథ్స్ అర్థమయ్యేలా చెప్పలేక అతడు ఇలా ఏడ్చేసాడట.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఇది చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు చైనీయులు అని తెలుస్తోంది.ఒక బాలిక కుర్చీలో కూర్చొని మాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండగా ఆ అమ్మాయి వెనకే తన అన్నయ్య ఉన్నాడు.

అతడు ఏడుస్తూ కనిపించాడు.చెల్లికి లెక్కలు అర్థం అవ్వడం లేదని.

త్రిభుజం గురించి ఎంత వివరించినా ఆమె ట్రయాంగిల్‌కి రెండే కోణాలు ఉంటాయని చంపుతోంది అంటూ అతడు బాగా ఏడ్చేసాడు.నిజానికి తన చెల్లె బుర్రకి లెక్కలు ఎక్కకపోవడంతో అతడు బాగా విసిగిపోయాడు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

ఎంతలా అంటే అతనిలో వివరించే శక్తి అంతా పోయింది.దాంతో అతడు బోరున కన్నీరు కార్చాడు.

Advertisement

"నేను ట్రయాంగిల్‌లో మూడు రైట్ యాంగిల్స్ ఉంటాయని చెప్పాను.పాయింట్ అవుట్ చేసి కూడా చూపించాను కానీ తాను రెండే అని తెగ కాల్చుకు తింటోంది" అని కంటతడి పెట్టుకుంటూ చెప్పుకొచ్చాడు.నిజానికి ట్రయాంగిల్‌లో మూడు ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి.

రైట్ యాంగిల్స్ అనేది ఒక్కటే ఉంటుంది.సో, ఇక్కడ ఇద్దరూ తప్పే చెప్పారు.

అందుకే బాలిక హోంవర్క్ ఫినిష్ కాలేదు.చివరికి అన్నయ్య ఏడ్చేసినా సొల్యూషన్ మాత్రం దొరకలేదు.

ఈ వీడియో చూసినా చాలామంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.తమకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా అర్థమయ్యేలా చెప్పలేక ఇలానే ఏడ్చేస్తుంటారంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా బుక్ చేయండి.

తాజా వార్తలు