తెగిన పెన్నా నది బ్రిడ్జి.. భయం గుప్పిట్లో ప్రజలు

శ్రీ సత్యసాయి జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా పోచంపల్లి వద్ద పెన్నా నది బ్రిడ్జి తెగింది.

దీంతో పోచంపల్లి, హిందూపురం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.అటు ఎగువ ప్రాంతం కర్ణాటక నుంచి పెన్నానదికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు