' బ్రో' ట్రైలర్ అప్డేట్.. ఎట్టకేలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ బ్రో అవతార్.

( Bro ) ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కొన్ని రూమర్స్ బయపెట్టాయి.

బ్రో సినిమా వాయిదా పడింది అని ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టమే అని.ఇంకా పెండింగ్ పనులు చాలానే ఉండడంతో ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేస్తున్నారు అని రూమర్స్ వచ్చాయి.

అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా చెప్పడంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రో.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, పాటలు అలరించాయి.ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.జులై 21న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత టిజి విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేసారు.

Advertisement

దీంతో ఈ ట్రైలర్ కోసం అంత ఎదురు చూస్తున్నారు.మరి ట్రైలర్( Bro Movie Trailer ) వస్తుంది అంటే రిలీజ్ వాయిదా పడే అవకాశం అయితే లేదు అనే చెప్పాలి.

చూడాలి ఏం జరుగుతుందో.ఇక సముద్రఖని( Samuthirakhani ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు